ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ప్రధాన పాత్రధారి” అని జగన్ వ్యాఖ్యానించారు. ఆరు నెలలకే చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తుందని ప్రజలను స్పష్టంగా అర్థమైందన్నారు. ఎలక్ట్రిసిటీ ఛార్జీల రూపంలో ప్రజలపై భారాలు వేస్తూ, సంక్షేమ పథకాలను తగ్గించారన్నారు. ప్రజాస్వామ్యం వింత రాజకీయ విధానాలు తీసుకువస్తున్నారని, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యంగం నడుపుతున్నారని జగన్ విమర్శించారు.
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కఠిన పరిస్థితులలోనూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందని చెప్పారు. “కోవిడ్ సమయాల్లోనూ సంక్షేమ కార్యక్రమాలకు ఆపడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేశాం. ఇది దేశ చరిత్రలో తొలిసారి” అని జగన్ వివరించారు.
పోరాటానికి పిలుపు..
పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. “ఇది మనం పోరాటం చేయాల్సిన సమయం. ప్రజల సమస్యలపై పోరాటాలు చేయాలి. కరెంటు ఛార్జీల పెంపు, రైతుల సమస్యలు, విద్యా రంగ సమస్యలపై నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాడితే, ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి సానుకూలంగా మార్చగలం” అని జగన్ చెప్పారు.
 విజన్ 2047పై ఎద్దేవా..
చంద్రబాబు ప్రకటించిన “విజన్ 2047″పై జగన్ విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు ప్రజలకు సహకారం అందించలేని వారు 2047ను ఎలా రూపకల్పన చేస్తారు? అది విజన్ కాదు, దగా అని జగన్ పేర్కొన్నారు.
- విజన్ అంటే మనది..
- ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రివెంటివ్ కేర్ విషయంలో అనేక చర్యలు తీసుకున్నాం.
- ఆర్బీకే వ్యవస్థ ఒక విజన్. ప్రతీ ఎకరాకు ఈ-క్రాప్ చేయడం విజన్. ప్రతీ ఎకరాకు ఉచిత పంటల బీమా తీసుకురావడం ఒక విజన్. రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చేయడం ఒక విజన్.
- ఈ మార్పులన్నీ వచ్చింది వైసీపీ హయాంలోనే అని జగన్ వివరించారు.





 



