ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రస్తుతం రైతులు (Farmers) ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులపై మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో “హలో ఇండియా (Hello India).. ఒకసారి ఏపీవైపు చూడండి” అంటూ సంచలన ట్వీట్ చేశారు. దీనికి “Save AP Farmers” అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ రంగం (Andhra State Agriculture Sector)లోని దయనీయ పరిస్థితులను దేశ దృష్టికి తీసుకువచ్చారు.
అరటిపండ్లు కిలోకు అర్ధ రూపాయి
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తన ట్వీట్‌లో అరటి రైతుల (Banana Farmers) ఆవేదనను వ్యక్తం చేశారు. కిలోకు కేవలం అర్ధ రూపాయికే అమ్ముడవుతున్నాయని, దీంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. అగ్గిపెట్టె, బిస్కెట్ ధర కంటే కూడా అరటిపండ్లు చౌకగా అమ్ముడవడం రాష్ట్రంలో సాగురంగం ఎంత దిగజారిందనే విషయానికి నిదర్శనమని పేర్కొన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలల తరబడి కష్టపడి పండించిన పంటకు ఇంత తక్కువ ధర రావడంతో రైతులకు భారీ ఎదురుదెబ్బ అని జగన్ తెలిపారు. సాగురంగం కూలిపోతున్నా.. చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యవర్తులకే లాభం
మార్కెట్‌లో అరటిపండ్లను డజన్ రూ.60–70లకు విక్రయిస్తున్నప్పటికీ, ఆ లాభాలు మధ్యవర్తులకే చేరుతున్నాయన్నారు. కిలో అర్ధ రూపాయికే అమ్ముకుంటున్న రైతులకు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పంటలను రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అరటి పంటే కాకుండా ఉల్లి, టమోటా, బొప్పాయి వంటి పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల్లోకొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉల్లి, టమాట ధరలు కేజీకి రూ.1.50 నుండి రూ.3 వరకు పడిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు రైతులకు ఉచిత పంట బీమా (Free Crop Insurance) లేదని, ఇన్‌పుట్ సబ్సిడీ (Input Subsidy) కూడా అందడం లేదని జగన్ ఆరోపించారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
మా హయాంలో రైతులకు మద్దతు ఇచ్చాం
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాంలో అరటిపండ్ల ధర టన్నుకు రూ.25,000 పలికేదని, రైతు ఉత్పత్తుల రవాణా కోసం ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు నడిపినట్లు, రైతుల పంటలను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసినట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని జగన్ ఆరోపించారు. అరటిపండ్లు కిలో అర్ధ రూపాయికి పడిపోయే పరిస్థితికి ప్రభుత్వం చోద్యం చూస్తోందని, సాగు రంగం కుప్పకూలిపోతున్నా స్పందన లేదని విమర్శించారు. “అరటిపండ్లు అర్ధ రూపాయి అయితే.. వాటిని పండించే రైతుల విలువ ఎంత?” అని జగన్ ప్రశ్నించారు.
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025
One kilogram of bananas is being sold for just Rs 0.50!
Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.
Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD








