నేడు పులివెందులకు వైఎస్ జ‌గ‌న్‌.. మూడు రోజుల పర్యటన

నేడు పులివెందులకు వైఎస్ జ‌గ‌న్‌.. మూడు రోజుల పర్యటన

మాజీ సీఎం (Former CM), వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula)లో పర్యటించనున్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి (YS.Rajasekhara Reddy) వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఈ రోజు పులివెందులకు చేరుకోనున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు, ప్రజలకు వైఎస్‌ జగన్ అందుబాటులో ఉంటారు. రేపు (2వ తేదీ) ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్ (YSR Ghat) వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం లింగాల మండలం అంబకపల్లి చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్ రూ.2.5 కోట్ల వ్యయంతో అంబకపల్లిలో కొత్తగా చెరువు నిర్మాణం చేపట్టారు. అదనంగా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిధులతో మరో రూ.2.5 కోట్లతో ఎత్తిపోతల పథకం, పైప్‌లైన్‌ పనులు చేపట్టారు. తాజాగా లింగాల కుడి కాల్వ నుంచి అంబకపల్లి గంగమ్మకుంట చెరువుకు నీరు చేరి అందుబాటులోకి వచ్చింది. వైఎస్‌ జగన్ ఈ చెరువులో జలహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మ‌మేక‌మ‌య్యే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 3 ఉదయం ఆయన పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.

Join WhatsApp

Join Now

Leave a Comment