నేడు నెల్లూరు జిల్లా నేత‌ల‌తో వైఎస్ జగన్ కీల‌క‌ భేటీ

నేడు నెల్లూరు జిల్లాలో నేత‌ల‌తో వైఎస్ జగన్ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (బుధవారం) నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైరపర్సన్‌లు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం సందర్భంగా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో పరిష్కరించాల్సిన సమస్యలు, ఇతర ముఖ్య అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగ‌త నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసే జిల్లా క‌మిటీలపై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదే విధంగా కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండేలా నెల్లూరు జిల్లా పార్టీ నేత‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment