నాయకులు, కార్యకర్తలకు, బాధిత ప్రజలకు అండగా వైసీపీ డిజిటల్ బుక్ ప్రారంభమైంది. ప్రతిపక్ష వైసీపీ (YCP)లో అన్యాయానికి గురవుతున్న క్యాడర్ కోసం ఆ పార్టీ అధినేత, మాజీ (Former)ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్(YS Jagan) గతంలో చెప్పినట్లుగానే డిజిటల్ బుక్ (Digital Book)కు శ్రీకారం చుట్టారు. అన్యాయానికి గురైన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తమ ఫిర్యాదులను ఈ డిజిటల్ బుక్‌లో అప్లోడ్ చేస్తే.. అధికారంలోకి వచ్చాక దాని పని అది చేసుకుంటూ వెళ్తుందని, అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగేలా ఈ డిజిటల్ బుక్ చూసుకుంటుందని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు.

నేడు తాడేపల్లి (Tadepalli) కేంద్ర కార్యాలయం (Central Office)లో మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ పార్టీ విస్తృతస్ధాయి (Wide Level) సమావేశం (Meeting) జరిగింది. ఈ కార్యక్రమంలో ‘డిజిటల్ బుక్’ (Digital Book)పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను జగన్ ప్రారంభించారు. కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా వివరాలు అప్‌లోడ్ చేయండి అని పిలుపునిచ్చారు. Digitalbook.weysrcp.com పేరుతో పోర్టల్ లాంచ్ చేశారు జగన్.

ఇది https://digitalbook.weysrcp.com/auth/phoneలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్రపరుస్తారు. వెబ్‌సైట్‌తో పాటు, 040-49171718 ద్వారా IVRS కాల్ సౌకర్యం ఏర్పాటు చేసింది వైసీపీ. దీని ద్వారా కార్మికులు మరియు బాధితులు ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ బుక్ కు ఒక క్యూఆర్ కోడ్ (QR Code) కూడా ఉంది. నేరుగా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, తమ సమస్యలకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. అనంతరం ఆ వివరాలను నమోదు చేయాలి. జగన్ 2.0 ప్రభుత్వంలో తమ కార్యకర్తలను, నేతలను అన్యాయంగా వేధించిన వారిని వదిలిపెట్టేది లేదని పలు సందర్భాల్లో జగన్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.








