అమరావతిపై (Amaravati) మాజీ సీఎం (Former Chief Minister) వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) తన పార్టీ స్టాండ్‌ను (Party Stand) ప్రకటించారు. రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) భారీ కుంభకోణాలకు (Huge Scams) పాల్పడుతున్నారని వైసీపీ అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేము అమరావతికి వ్యతిరేకం కాదు.. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ, అమరావతి ముసుగులో చంద్రబాబు చేస్తున్న దోపిడీకి, స్కాములకు మాత్రమే వ్యతిరేకం” అని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ అమరావతికే కాదు..
— Telugu Feed (@Telugufeedsite) April 1, 2026
రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వ్యతిరేకం కాదు..
కొన్ని వాస్తవమైన విషయాలు ప్రెస్‌మీట్ ద్వారా ప్రజలకు ముందుకు తీసుకెళ్తాం
– మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/VCZWK2NBUk
సాధ్యం కాని ప్రాజెక్టుతో ప్రజల కళ్ళకు గంతలు
అమరావతిలో కనీస మౌలిక సదుపాయాల (Basic Infrastructure) కల్పనకే రూ. 2 లక్షల కోట్లు అవసరమని, అంత ఖర్చు పెట్టే స్థోమత రాష్ట్రానికి లేదని తెలిసినా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని జగన్ విమర్శించారు. తన స్కాముల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అసెంబ్లీలో తీర్మానాల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అధికారం చేపట్టిన రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ. 3.37 లక్షల కోట్ల అప్పు చేశారని, జీతాలు ఇవ్వడానికే అప్పు చేయాల్సిన పరిస్థితిలో రూ. 2 లక్షల కోట్లు రాజధానిపై ఎప్పుడు ఖర్చు చేస్తారని నిలదీశారు.
వీరప్పన్ కూడా చంద్రబాబు దోపిడీకి సరిపోడు
— Telugu Feed (@Telugufeedsite) April 1, 2026
2018లో సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2 నిర్మాణానికి ఖరారైన కాంట్రాక్ట్ వ్యాల్యూ రూ.932 కోట్లు
ఇప్పుడు అదే పని విలువ రూ.1423 కోట్లకు పెంచారు
టెండర్లలో పెంచిన రేటుకు 4.5 శాతం ఎక్సెస్, కాంట్రాక్టర్‌కు జీఎస్టీ, సీనిరేజ్,… pic.twitter.com/qk9DizNXo3
విశాఖే ఎందుకు? జగన్ వివరణ
అభివృద్ధి (Development) కేవలం ఒకే చోట కేంద్రీకృతం (Centralized) కాకూడదన్నదే తమ విధానమని జగన్ పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడాలంటే తక్కువ ఖర్చుతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న విశాఖపట్నాన్ని (Visakhapatnam) అందుకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా (Executive Capital) ప్రకటించాం అని వివరించారు. చంద్రబాబు తన బినామీల భూముల విలువ పెంచుకోవడం కోసమే అమరావతిపై పట్టుబడుతున్నారని, దీనివల్ల ఇతర ప్రాంతాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమంపై అమరావతి ఎఫెక్ట్
అమరావతి కోసం తెస్తున్న అప్పుల వల్ల రాష్ట్రంలో కీలక రంగాలు కుంటుపడుతున్నాయని జగన్ ఆరోపించారు. ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీ (Aarogyasri) ఆగిపోయింది. నాడు-నేడు (Nadu-Nedu) నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైందని, ఉద్యోగుల బకాయిలు రూ. 36 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. అమరావతిలో పెట్టే లక్షల కోట్ల వల్ల సామాన్యుడికి అందాల్సిన సంక్షేమ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే..
— Telugu Feed (@Telugufeedsite) April 1, 2026
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ ఇతర బాధ్యత పరిస్థితి ఏమిటీ..?
అమరావతి మీద అప్పులు తెచ్చి చేస్తున్న స్కాముల ప్రభావం రాష్ట్రంలో ఇప్పటికే కనిపిస్తోంది
ఇప్పటికే రాష్ట్రంలో నాడు-నేడు పనులు… pic.twitter.com/fHA8mvZEFD
“విచారణ తప్పదు.. శిక్ష ఖాయం”
చంద్రబాబు చేస్తున్న ఈ దోపిడీ ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కాకపోయినా రేపైనా ఆధారాలతో సహా అన్ని బయటపెడతాం. ప్రజలను వంచించి చేస్తున్న ఈ దోపిడీపై భవిష్యత్తులో విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని, దేవుడు చంద్రబాబుకు మొట్టికాయలు వేయడం ఖాయమని ఆయన హెచ్చరించారు.







