‘మీ ప్రేమకు రుణపడి ఉంటా..’ – వైఎస్ జ‌గ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్

'మీ ప్రేమకు రుణపడి ఉంటా..' - వైఎస్ జ‌గ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్

వైసీపీ అధినేత‌, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో ఉన్న ఆయ‌న అభిమానులు ఘ‌నంగా సంబ‌రాలు జ‌రుపుకున్నారు. అభిమాన నేత‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ కేక్ క‌టింగ్‌లు, ర్యాలీలు, సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. వైసీపీ అభిమానులు మాత్ర‌మే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖులు జ‌గ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

త‌నకు వ‌స్తున్న‌ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లపై వైఎస్ జ‌గ‌న్ స్పందిస్తూ.. ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. “నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ.. అలాగే ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన నా వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైయ‌స్ఆర్ సీపీ కుటుంబ స‌భ్యుల రుణం ఎప్ప‌టికీ తీర్చుకోలేనిది” అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

జ‌గ‌న్ ట్వీట్ కింద “పొలిటిక‌ల్ సూప‌ర్ స్టార్‌, Onces again Happy Birthday Anna, ట్రూ లీడ‌ర్” అంటూ వైసీపీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, గ‌వ‌ర్న‌ర్ ఇలా ప్ర‌ముఖులు ట్వీట్ చేసి విషెస్ షేర్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment