బంగారుపాళ్యంలో జగన్ పర్యటన.. ఆంక్షలున్నా త‌గ్గ‌ని వైసీపీ

బంగారుపాళ్యంలో జగన్ పర్యటన.. ఆంక్షలున్నా త‌గ్గ‌ని వైసీపీ

వైసీపీ(YSRCP) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం (Bangarupalem)లో ప‌ర్య‌టించ‌నున్నారు. మామిడి మార్కెట్ యార్డు (Mango Market Yard)కు వెళ్లి ధ‌ర‌ల్లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న రైతుల‌ను(Farmers) ప‌రామ‌ర్శించ‌నున్నారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ధరల సంక్షోభం, పల్ప్ ఫ్యాక్టరీల నుంచి కొనుగోళ్లు లేకపోవడం వంటి సమస్యలపై రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారికి సంఘీభావం తెలపడానికి ఈ ప‌ర్య‌ట‌న సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే.. జ‌గ‌న్‌ పర్యటన నేప‌థ్యంలో పోలీసులు విధించిన కఠిన ఆంక్షలు, చెక్‌పోస్టులు (Checkposts), వాహనాల సీజ్ (Vehicles Seizing), రౌడీషీట్ (Rowdy Sheet) బెదిరింపులు జిల్లాలో కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించాయి.

జగన్‌మోహన్ రెడ్డి బంగారుపాళ్యం ప‌ర్య‌ట‌న‌కు సుమారు 10 వేల మంది రైతులు, అభిమానులు వ‌స్తార‌ని వైసీపీ నేత‌లు పోలీసుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, పోలీసులు హెలిప్యాడ్ వ‌ద్ద 30 మందికి, మార్కెట్ యార్డు వ‌ద్ద 500 మందికి మాత్ర‌మే అనుమతి ఇస్తూ షరతులు విధించారు. భద్రతా కారణాలు, గతంలో జగన్ పర్యటనల సందర్భంగా జరిగిన గందరగోళాలను సాకుగా చూపి పోలీసులు ఈ ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్ద డబుల్-లేయర్ బారికేడింగ్, సీసీటీవీ సర్వైలెన్స్, 10 వాహనాలకు మాత్రమే అనుమతి వంటి షరతులు కూడా విధించారు.

అయితే కూట‌మి ప్ర‌భుత్వం కావాల‌నే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌కుండా జ‌నాల‌కు అడ్డుకుంటోంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జగన్ పర్యటనను విజ‌య‌వంతం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు బంగారుపాళ్యం వైపు భారీగా తరలివచ్చారు. అయితే, అడుగడుగునా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను సీజ్ చేయడం, రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడం చేశారు. కొన్ని చోట్ల వైసీపీ నాయకులతో పోలీసుల మధ్య వాగ్వాదాలు జరిగాయి, మరికొన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులపై లాఠీచార్జ్ జరిగినట్లు సమాచారం. ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ, జగన్ అభిమానులు, రైతులు నడిచి బంగారుపాళ్యం చేరుకునే ప్రయత్నం చేశారు.

వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి (Peddireddy Ramachandra Reddy), భూమన కరుణాకర్ రెడ్డి (Bhoomana Karunakar Reddy), మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. వారికి నోటీసులు అంద‌జేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వారు విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రిక్తతలను తెరపైకి తెచ్చింది. వైసీపీ నాయకులు ఈ ఆంక్షలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం జగన్ పర్యటనను అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు. పోలీసుల ఆంక్ష‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా రైతులు, వైసీపీ అభిమానులు బంగారుపాళ్యం త‌ర‌లివెళ్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment