నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు

నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూట‌మి ప్ర‌భుత్వ విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున‌ చేపడుతోంది. అధినేత వైఎస్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్దకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీతో త‌ర‌లివ‌చ్చి అక్క‌డే బైఠాయించి ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌నున్నారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.

ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమం
వైసీపీ నేతలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని ఆరోపిస్తూ, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వంపై విమర్శలు
విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం అసహనానికి దారితీస్తోందని వైసీపీ అభిప్రాయపడుతోంది. విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment