‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15,000 అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా తల్లికి వందనం హామీ అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో “ఏ ఒక్కరికైనా రూ. 15,000 వచ్చాయా?” అని వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రశ్నించింది.
ఇలాంటి బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చి సరిగ్గా 6 నెలలు అయింది. ఏ ఒక్కరికైనా అందులో చెప్పినట్లు రూ.15,000 వచ్చాయా రావు ..ఎందుకంటే చెప్పింది నయా మాయల ఫకీర్ @ncbn తాలూకా కాబట్టి. మీకు మీరు మంచి ప్రభుత్వం అని సంబరాలు చేసుకోవడం కాదు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి.… pic.twitter.com/9E8FRBQM0p
— YSR Congress Party (@YSRCParty) December 12, 2024
టీడీపీ నేత వీడియోను షేర్ చేస్తూ ప్రశ్న
అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ నేతలు “తల్లికి వందనం” పథకం గురించి చేసిన ప్రచార వీడియోని ఎక్స్‌లో షేర్ చేసింది వైసీపీ. ఈ వీడియో ద్వారా ప్రజలకు కూటమి పార్టీలు హామీని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని సూటి ప్రశ్న వేసింది.
ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ప్రజలకు సమర్థమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించింది.