వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఆయనతో పాటు మరో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయనున్నట్లు పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయి. దీంతో విదేశాల నుంచి వచ్చిన ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజంగా ఉంటాయని, వాటిని తట్టుకుని నిలబడాలన్నారు. అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే ఏపీ ఎన్నికల్లో వైపీనే గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు.
ప్రతీ రాజకీయ పార్టీకి ఎత్తుపల్లాలు ఉంటాయని, ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పారు. ఓటమిలో కూడా తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉందని, కష్టాలు వచ్చినప్పుడే నిలబడి పోరాటాలు చేయాలని, అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. విజయసాయి రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదని, . ఆయన రాజకీయాలకు దూరంగా జరగడం ఆయన వ్యక్తిగతమన్నారు. తాను వైసీపీలోనే ఉంటానని అయోధ్యరామిరెడ్డి స్పష్టం చేశారు.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్