గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో అభిమానులు మరణించడంతో, వారికి పరిహారం ప్రకటించడం గురించి ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు.
"పుష్ప" కేమో నీతులు చెప్తారా !
— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025
"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan
పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ, “పుష్పకేమో నీతులు చెప్తారా.. గేమ్ ఛేంజర్‌కి పాటించరా!” అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అంబటి ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మెగా ఫ్యాన్స్ ఈ ట్వీట్‌పై వ్యతిరేక స్వరం వినిపిస్తుండగా, తటస్థులు, మేధావులు, బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
పుష్ప-2 ఘటనపై గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించిన పవన్.. రూ.5 లక్షల ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని, పవన్ స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలను ఎందుకు పరామర్శించడం లేదని బన్నీ ఫ్యాన్స్ బదులిస్తున్నారు.