ఏలూరు జిల్లా (Eluru district) లోని వెన్నవల్లివారిపేట (Vennavallivaripeta) లో దారుణ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. చిట్టీల వ్యాపారం చేస్తున్న రమణమ్మ (Ramannamma) (65)పై దుండగులు పెట్రోల్ (Petrol) పోసి నిప్పంటించినట్లు ఆమెను హత్య చేశారు. మంటల్లో కాలి రమణమ్మ మృతిచెందినట్లుగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటన వెనుక గల కారణాలపై పోలీసులు (Police) దర్యాప్తును ముమ్మరం చేశారు.
క్లూస్ టీమ్ (Clues Team), డాగ్ స్క్వాడ్ (Dog Squad), పోలీసు అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై స్పష్టత రాలేదని, రమణమ్మ వ్యక్తిగత జీవితం, ఆర్థిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. హంతకులు ఎవరై ఉండొచ్చనే కోణంలో సీసీటీవీ ఫుటేజీ (CCTV Footage), స్థానికుల సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
స్థానికంగా భయాందోళనలు
ఈ ఘోర సంఘటన ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అర్ధరాత్రి (Midnight) ఒంటరిగా ఉన్న మహిళపై దాడి (Attack) జరగడం విచారం వ్యక్తమవుతోంది. పోలీసులు త్వరలోనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల మంగళగిరి (Mangalagiri) సమీపంలో ఓ మహిళను కొందరు దుండగులు నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసిన విషయం తెలిసిందే.