సాయిపల్లవికి మాత్రమే సీత పాత్ర ఎందుకంటే..?

సాయిపల్లవికి మాత్రమే సీత పాత్ర ఎందుకంటే..?

యుగాలు మారినా, తరాలు గడిచినా రామాయణం గొప్పతనానికి ఏమాత్రం తగ్గేదేలేదు. తాజాగా బాలీవుడ్‌ (Bollywood)లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (‘Ramayana’) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడి (Rama)గా, సాయిపల్లవి (Sai Pallavi) సీత (Sita)గా నటిస్తున్నారు.

ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛబ్రా (Mukesh Chhabra) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రణ్‌బీర్ కపూర్‌ రాముడి పాత్రకు ఎంపికైన విషయం గురించి మాట్లాడుతూ – “ఆయన ప్రశాంత స్వభావం, లోతైన నటనా ప్రతిభ రాముడి పాత్రకు అద్భుతంగా సరిపోతుంది” అని పేర్కొన్నారు.

అలాగే సీత పాత్ర విషయానికి వస్తే ముఖేశ్ ఛబ్రా పేర్కొన్న మాటలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. “ఈ పాత్ర కోసం చాలామందిని పరిగణనలోకి తీసుకున్నాం. కానీ చివరికి సాయిపల్లవినే ఎంపిక చేశాం. ఆమె గ్లామర్‌కు దూరంగా ఉండటం, సహజమైన అందం కలిగి ఉండటం, ముఖంపై ఎటువంటి సర్జరీలు చేయించుకోకపోవడం వల్లే ఆమెను ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమాతో సహజత్వానికే ప్రాధాన్యత ఇస్తున్నాం అన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం” అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సాయిపల్లవి ఎంపికపై ప్రేక్షకుల్లో విశేష ఉత్సుకతను పెంచుతున్నాయి.

ఇక ఈ ‘రామాయణ’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment