2027 వరల్డ్‌కప్‌పై కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్‌లో భారీ చర్చ

2027 వరల్డ్‌కప్‌పై కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్‌లో భారీ చర్చ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన భవిష్యత్తు, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్‌కప్‌లో(2027 ODI World Cup) ఆడతాడా లేదా అన్న చర్చలపై తొలిసారి ఘాటుగా స్పందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. “నా విలువను మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే, నేను అక్కడ ఉండను” అంటూ స్పష్టం చేశాడు. ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత టీ20లకు గుడ్‌బై చెప్పిన కోహ్లీ, గతంలో టెస్ట్ క్రికెట్‌కూ వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ స్టార్ బ్యాటర్, తాను ఇప్పటికీ అదే క్రమశిక్షణతో సిద్ధమవుతానని తెలిపాడు. “వన్డేలో 40 ఓవర్లు బౌండరీ నుంచి బౌండరీకి పరుగెత్తమంటే కూడా ఫిర్యాదు చేయను. ప్రతి బంతినీ కెరీర్‌లో చివరి బంతిలా ఆడతాను” అంటూ తన అంకితభావాన్ని వివరించాడు.

ఇక 2027 వరల్డ్‌కప్‌పై వస్తున్న ప్రశ్నలకు కూడా కోహ్లీ(Kohli) క్లారిటీ ఇచ్చాడు. “ఆడాలనిపించకపోతే ఇంటిని వదిలి వచ్చి ఇలా సిద్ధం కాను కదా” అంటూ తాను ఇంకా భారత జట్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెప్పాడు. అయితే ఆటగాడి విలువను జట్టు కూడా గుర్తించాలని, ఫలితాల ఆధారంగా అభిప్రాయాలు మార్చడం సరికాదని వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో(Vijay Hazare Trophy) ఢిల్లీ (Delhi) తరఫున ఆడిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, దేశీయ క్రికెట్ తనలో మళ్లీ ఆటపై స్వచ్ఛమైన ఆనందాన్ని తీసుకొచ్చిందని తెలిపాడు. రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లీ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment