గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారంతో వార్తల్లో నిలుస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాలీవుడ్‌లో హాట్ టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఓ చారిత్రాత్మక కోటలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్లిని సింపుల్‌గా కానీ గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
పెళ్లి అనంతరం విజయ్ – రష్మికలు హైదరాబాద్‌కు రానుండగా, మార్చి 4న నగరంలోని ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు స్టార్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని టాక్. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయని సమాచారం. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్ గానీ, రష్మిక గానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో అభిమానులను మెప్పించిన ఈ జంట నిజ జీవితంలో ఒక్కటవుతుందనే వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
\
]








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్