తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో శ్యామలరావు (EO-Syamala Rao) అధికార నివాసం (Official Residence) లో గురువారం రాత్రి అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నాగుపాము (Cobra) ప్రత్యక్షమవ్వడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన ఈవో శ్యామలరావు, సంబంధిత అధికారులకు విషయం తెలియజేశారు.
సమాచారం అందుకున్న రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి (Retired TTD Employee) రవీందర్ నాయుడు (Ravinder Naidu) పామును పట్టేందుకు అక్కడికి చేరుకున్నారు. బంగ్లాలో బుసలు కొడుతున్న పామును చాకచక్యంగా వేటాడి పట్టుకున్న ఆయన, దానిని గోనె సంచి (Gunny Bag)లో వేసే ప్రయత్నంలో ఒక్కసారిగా ఆ పాము అతని చేతిపై కాటేసింది.
ఈ దృశ్యాన్ని చూసిన సిబ్బంది వెంటనే స్పందించి రవీందర్ నాయుడును తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SWIMS) ఆసుపత్రి (Hospital) కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స కొనసాగుతోంది. అధికార వర్గాల ప్రకారం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య