సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష (Trisha), 42 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సీనియర్, యంగ్ హీరోలతో జోడీ కట్టి, భారీ పారితోషికంతో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతోంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో త్రిషపై తీవ్ర ట్రోలింగ్ (Trolling) జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే?
త్రిష ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) చిత్రంతో పాటు, మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan), శింబు (Simbu) ప్రధాన పాత్రల్లో నటించిన థగ్ లైఫ్ (Thug Life) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో త్రిష ఇంద్రాణి (Indrani) అనే వేశ్య పాత్ర (Prostitute Role)లో కనిపించింది. అయితే, ఈ పాత్ర సినిమా కథకు పెద్దగా సంబంధం లేకపోవడం, కేవలం గ్లామర్ కోసం ఉపయోగించినట్లు అనిపించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలో త్రిష పాత్ర శక్తిరాజు (కమల్ హాసన్)తో సన్నిహితంగా ఉంటుంది. శక్తిరాజు తనను బార్ డ్యాన్సర్ జీవితం నుంచి కాపాడాడని, అతడికి పెళ్లి అయినప్పటికీ అతడితో ఉంటుంది. అయితే, అమర్ (శింబు) ఆమెపై ఆకర్షితుడై, శక్తిరాజును చంపినట్లు చెప్పడంతో త్రిష అతడితో వెళ్తుంది. తర్వాత శక్తిరాజు తిరిగి వచ్చినట్లు తెలిసి ఆమె సందిగ్ధంలో పడుతుంది.
ఈ పాత్రకు కథాంశంతో సంబంధం లేకపోవడం, స్పష్టత లేని చిత్రణతో అభిమానులు నిరాశ చెందారు. “ఇలాంటి పాత్రను త్రిష ఎందుకు ఒప్పుకుంది?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, త్రిష మాత్రం గతంలోనూ “సినిమా పాత్రలతో ఎక్కువగా కనెక్ట్ కావద్దు” అని చెబుతూ వస్తోంది.