తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా?

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా?

Summarize with AI

తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) అసెంబ్లీ ఉపఎన్నిక (Assembly By-election) ఆసక్తికరంగా మారింది. డీఎంకే(DMK) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ (M.K. Stalin) ఈ స్థానం నుంచి పోటీ చేయాలంటూ పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలైన స్టాలిన్ ప్రస్తుతం శాసనసభ వెలుపల ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలంటే తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక సరైన అవకాశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంపై డీఎంకే(DMK) అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) రెండు నియోజకవర్గాలైన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయం సాధించడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే తిరుచ్చి దక్షిణ జిల్లా డీఎంకే కార్యవర్గం స్టాలిన్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని తీర్మానం చేయగా, మాజీ మంత్రులు కే.ఎన్. నెహ్రూ (K.N. Nehru), అన్బిల్ మహేష్ పొయ్యామొళి (Anbil Mahesh Poyyamozhi) తదితర నేతలు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. స్టాలిన్ స్వయంగా బరిలోకి దిగుతారా? లేక పార్టీ మరో నేతకు అవకాశం ఇస్తుందా? అనే అంశంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment