‘గంజాయి విక్రేత‌లు పోలీసులే..’ – టీడీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

'గంజాయి విక్రేత‌లు పోలీసులే..' - టీడీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరువూరు (Tiruvuru) పోలీస్ స్టేషన్‌ (Police Station)లో టీడీపీ(TDP) ఎమ్మెల్యే (MLA) కొలికపూడి శ్రీనివాస్ రావు (Kolikapudi Srinivas Rao) హంగామా సృష్టించారు, పోలీసులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తిరువూరు పోలీసులు గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని, ఎస్‌ఐ సత్యనారాయణ ఒక గ్యాంగ్‌ను నడిపిస్తూ గంజాయి(Ganja) వ్యాపారం (Business) చేస్తున్నారని కొలిక‌పూడి చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కొలిక‌పూడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. గత రాత్రి టీడీపీ కార్యకర్తలైన చిల్లపల్లి రామకృష్ణ (Chillapalli Ramakrishna), కందిమల్ల సాయి సుమిత్ (Kandimalla Sai Sumith) మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రామకృష్ణ తనపై దాడి చేసిన సాయి సుమిత్‌పై సీసాతో కొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు(Police) సాయి సుమిత్‌ను విడిచిపెట్టగా, రామకృష్ణపై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు అతని తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మీలను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ చర్యలపై ఆగ్రహించిన కొలికపూడి, సాయి సుమిత్‌ను స్టేషన్‌కు పిలిపించే వరకు కదిలేది లేదని హంగామా చేశారు. రామకృష్ణపై కేసు నమోదు చేయడం రాజకీయ ఒత్తిడిలో భాగమని, ఎంపీ వర్గానికి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటన తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత కలహాలను బయటపెట్టింది. కొలికపూడి శ్రీనివాస్ రావు గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు, ఇటీవల ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌ను వేధించారనే ఆరోపణలు, సూసైడ్ నోట్ క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. తాజాగా పోలీసులపై గంజాయి అమ్మకాలకు సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొలికపూడి ఆరోపణలపై పోలీసు అధికారులు లేదా సంఘం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment