---Advertisement---

క్ష‌మాప‌ణ వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్‌కు టీటీడీ చైర్మ‌న్ కౌంట‌ర్‌

క్ష‌మాప‌ణ చెబితే ప్రాణం తిరిగొస్తుందా..? - ప‌వ‌న్‌కు బీఆర్ నాయుడు కౌంట‌ర్
---Advertisement---

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోగా, ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డి ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు టీటీడీ, పోలీస్‌ అధికారుల నిర్ల‌క్ష్యమే కార‌ణ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన బాధ్యత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జేఈవో వెంకయ్య చౌదరి తీసుకోవాలని, ఎక్కడైనా తప్పుజరిగితే తమ అందరి సమష్టి బాధ్యతని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుక్ర‌వారం పిఠాపురం స‌భ‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈవో వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని, సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై వెంటనే స్పందించడం అవసరం లేదని అన్నారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదని ఆయన అన్నారు కానీ, క్షమాపణలు చెప్పినంత మాత్రన జరిగిన పోయిన ప్రాణం తిరిగిరావు క‌దా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. పవన్ కల్యాణ్ చేసిన సూచనలపై బీఆర్ నాయుడు స్పందన మరింత విమర్శలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment