ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళగ వెట్రీ కజగం పార్టీ వ్యవస్థాపకుడు, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ తమిళ సినిమాలు, హిందీ భాష గురించి ప్రస్తావిస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని, హిందీని వ్యతిరేకించే పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై టీవీకే అధినేత దళపతి విజయ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. “మేము ఇతర భాషలకు గౌరవం ఇస్తాం. కానీ, వాటిని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తే సహించం” అంటూ ఆయన స్పష్టంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా, తమిళ, తెలుగు, మలయాళ భాషలను ఉత్తరాది రాష్ట్రాల్లో మూడో భాషగా పరిగణిస్తారా?” అంటూ విజయ్ ఫ్యాన్స్ ప్రశ్నించారు. తెలుగు సినిమాలను తమిళంలో డబ్ చేయడం మానేస్తారా..? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.