భారత మహిళల జట్టు ఖో ఖో వరల్డ్ కప్ విజయంలో తెలుగు వ్యక్తి ఇస్లావత్ నరేశ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బంజరపల్లికి చెందిన నరేశ్, జట్టుకు సహాయ కోచ్‌గా ఉన్నారు. 1995లో క్రీడాకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నరేశ్, 2015లో కోచ్‌గా మారారు. క్రీడా కోటా ద్వారా ఉద్యోగం పొందిన ఆయన, తన అంకితభావంతో అంచెలంచెలుగా జాతీయ జట్టుకు సహాయ కోచ్‌గా ఎదిగారు. ఆటగాళ్ల స్కిల్స్‌ను మెరుగుపరచడంలో, వారి బలహీనతలను సరిచేయడంలో నరేశ్ కీలక పాత్ర పోషించారు. స్కిల్ అనలైజర్‌గా ఆయన చేసిన విశ్లేషణలు జట్టు విజయంలో కీలకమయ్యాయి.
ఖోఖో తొలి ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 78-40 స్కోర్ తేడాతో చిత్తు చేసి, విశ్వ విజేతగా నిలిచింది. ఈ ప్రథమ వరల్డ్ కప్‌లో మొత్తం 23 దేశాలు పాల్గొన్నారు.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్