నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో తమ తమ పార్టీల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.

ఎన్నికల ప్రచారానికి..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ తరఫున ఆయన సాయంత్రం 7 గంటలకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో ప్రచారం చేపట్టనున్నారు. నేడు, రేపు ఆయన వివిధ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ పీఠం కోసం ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment