రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మంత్రులు కొండా సురేఖ(Konda Surekha),సీతక్క (Seethakka రక్షాబంధన్ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి (Chief Minister’s Residence) వెళ్లిన ఇద్దరు మహిళా మంత్రులు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ.. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల (Brother-Sister) మధ్య భరోసా, ఆత్మీయత, ప్రేమ, అనురాగం, గౌరవానికి ప్రతీక అని అన్నారు.
మహిళల జీవితాల్లో తండ్రి, సోదరుడు, భర్త, కొడుకు వంటి పురుషుల నుంచి లభించే రక్షణ, భరోసాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలోని మహిళలందరి తరఫున సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టానని, రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాఖీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించిన కొండా సురేఖ.. “నన్ను సపరేట్ చేయకండి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణలోని ప్రతి ఆడపడుచుకు ప్రతినిధినని, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల మహిళలకు సీఎం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల పరకాల అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి.
కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs), విప్‌లు (Whips) కొండా సురేఖ కుటుంబంపై (Konda Surekha’s Family) బహిరంగంగా విమర్శలు చేయడంతో పాటు, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి (Party Disciplinary Committee) ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.







