తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మహిళలకు (Women) టికెట్లపై (Tickets) కీలక వ్యాఖ్యలు చేశారు. రాంజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని, మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు.
‘తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ వర్సిటీలో మొక్కలు నాటి, బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్కను నాటారు. మంత్రి కొండా సురేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.