అవంతి శ్రీ‌నివాస్‌పై బుద్దా వెంకన్న సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

అవంతి శ్రీ‌నివాస్‌పై బుద్దా వెంకన్న సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీ సానుభూతి కూటమి అవసరం లేదు. నిన్ను రాజకీయంగా ఎదగనిచ్చిన చిరంజీవి కుటుంబానికి ద్రోహం చేశావు. నిన్ను ఢిల్లీలో నిలబెట్టిన సీఎం చంద్రబాబును అవమానించావు. ప్రజలను దోచుకున్న జగన్‌తో భాగస్వామిగా మారిపోయావు” అంటూ తన ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అవంతి శ్రీ‌నివాస్ రాజీనామా చేసిన నేప‌థ్యంలో బుద్ధా వెంక‌న్న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అవంతి టీడీపీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ బుద్దా వెంకన్న ట్వీట్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అవంతిని పార్టీ చేర్చుకునే విష‌యంలో నాయ‌కుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment