“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్‌

“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్‌

తెలుగుఫీడ్‌ డెస్క్: ముఖ్యమంత్రి కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను చట్టసభల సాక్షిగా తదుపరి నాయకుడిగా, భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించడానికి వేసిన వ్యూహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నాడు శాసనమండలి సాక్షిగా లోకేష్‌ కోసం వేసిన జాకీ ఎత్తుల మధ్య ఆయనే నలిగిపోయారు. దూకుడుగా ఉండి ప్రజల దృష్టిలో తానొక బ్రాండ్‌ను సృష్టించుకోవడానికి ప్రయత్నించిన లోకేష్‌ బోల్తా కొట్టారు. అరుపులు, కేకలు ప్రదర్శించారు కాని, వైసీపీ సూటిగా వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయారు. పైగా సమాధానాల్లో అవాస్తవాలు జోడించడంతో లోకేష్‌ తీరు పట్ల టీడీపీ సీనియర్లే నిశ్చేష్టులయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయస్సు ఈ విడత పదవీకాలం పూర్తయే సమయానికి దాదాపు 80 సంవత్సరాలు. డైనమిక్స్‌ పాలిటిక్స్ తరంలో శారీరకంగా, ఆలోచనా పరంగా క్రియాశీలకంగా ఉండలేరన్నది నిర్విదాంశం. ఈ నేపథ్యంలోనే లోకేష్‌ను భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ జోరుగా కొనసాగుతున్నాయి. పార్టీని, అధికార యంత్రాంగంలోనూ లోకేష్‌ జోక్యంలేనిదే ఏమీ జరగలేదనన్నది టీడీపీ వర్గాలే చెప్తున్నాయి. లోకేష్‌ నిర్ణయాల్లో పరిణితి లేకపోవడం, వ్యక్తులను అంచ‌నా వేసే సమర్థత లేకపోవడం, దూకూడు తనం, ప్రతి చిన్న ప్రతికూల అంశాన్ని తీవ్రంగా పరిగణించడం, తన పార్టీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీలనూ బలహీన పరచాలన్న కాంక్ష, ఇవి క్రమేణా కక్ష రాజకీయాలకు దారితీశాయన్నది టీడీపీ నాయకులే చెప్తున్నారు. చంద్రబాబు 4.Oకు రెడ్‌బుక్‌ రాజ్యాంగం తీవ్ర అప్రతిష్టను తీసుకొచ్చిందని టీడీపీ వర్గాల్లో బలమైన ముద్రపడిపోయింది. పాలనలోనూ, ప్రభుత్వంలోనూ విపరీతంగా అవినీతి పెరిగిపోయిందనే జనంకూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇవన్నీ లోకేష్‌ భవిష్యత్తు వారసత్వానికి ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని ఒక సీరిస్‌ పొలిటీషియన్‌గా చట్టసభల సాక్షిగా చూపించే ప్రయత్నం చేస్తే అది కాస్తా బెడిసి కొట్టింది.

మంగ‌ళవారం రోజు మండలిలో వీసీల తొలగింపు వ్యవహారంపై రగడ చెలరేగిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అన్ని యూనివర్శిటీల వైస్‌ ఛాన్సలర్లను బలవంతంగా రాజీనామా చేయించారు. ససేమిరా అన్నవారిపై తెలుగు విద్యార్థి విభాగంచేత దారుణంగా దాడులు చేయించారు. భయంతో చాలామంది తమ పదవులకు రాజీనామా చేశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆదేశాలతో, ప్రభుత్వం తమ సొంత మనుషులను పెట్టుకోవడానికి అనుకూలంగా ఈ రాజీనామాలు చేస్తున్నట్టు వీసీలుకూడా తమ రాజీనామాలేఖల్లో రాశారు. ఈ ఆధారాల సహాయంతో మండలిలో వైసీపీ సభ్యులు లోకేశ్‌ను కడిగి పారేశారు. ఆధారాలిస్తే విచారణ చేయిస్తామని చెప్పిన లోకేష్‌, వైసీపీ సభ్యులు చూపించే సరికి దాన్ని దాటవేసే ప్రయత్నంచేశారు.

మరొక విష‌యంలో కూడా లోకేష్‌ బోల్తాపడ్డారు. కొత్తగా వచ్చిన పరిశ్రమల ద్వారా 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామంటూ ఏకంగా గవర్నర్‌గారి ప్రసంగంలో ప్రభుత్వం పొందుపరిచింది. దీన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు నిలదీశారు. ఇది వాస్తవంగా లోకేష్‌ శాఖకు సంబంధం లేని విషయం. కాని, దాన్నికూడా తన భుజాల‌మీద వేసుకుని, సమర్థవంతంగా తిప్పికొట్టాననే ఒక ప్రొజెక్షన్‌ ఇచ్చే పనిలో చివరకు తానే దొరికిపోయారు. గవర్నర్‌గారి ప్రసంగంలో అచ్చుగుద్దినట్టుగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించామనే ఉంది. దీన్ని చూసుకోకుండా, ఇంగ్లీషు ప్రసంగాన్ని చూడాలంటా పక్కదోవ పట్టించే ప్రయత్నంచేశారు. ఈ వ్యవహారంలో లోకేశ్‌ అడ్డంగా బుక్కైపోతుంటే, ఆయన్ని కాపాడేందుకు టీడీపీ మండలి సభ్యులు ప్రయ్నతించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రత్యక్షప్రసారాలద్వారా వీక్షిస్తున్న జనం లోకేష్‌లో డొల్లతనాన్ని పసిగట్టారు.

వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడిన తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోకేష్‌ ప్రసంగించారు. లోకేష్‌ ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యూహంలో భాగంగా ఆ సమయంలో అసెంబ్లీకి విరామం ప్రకటించారు. తద్వారా అన్ని ఎల్లోమీడియా న్యూస్‌ ఛానళ్లలో లోకేశ్‌ ప్రసంగం వచ్చేలా చూసుకున్నారు. కాని ఈ ప్రసంగంలో లోకేశ్‌ బేలతనం కనిపించింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావొస్తున్నా ఇప్పటికే గత ప్రభుత్వంమీద నిందుల వేయడం చూస్తున్న ప్రజలకు విసుగు తెప్పించింది. తల్లికి వంద‌నం, రైతు భరోసా ఈ రెండూ అమలు చేస్తామంటూ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా లోకేష్‌ చేత చెప్పించినా, పథకం అమలు చేస్తున్న విధానంలో స్పష్టత, ఇప్పటివరకూ ప్రజలకు ఏం చేశామని చెప్పడంలో అస్పష్టత కారణంగా పెద్దగా ఆకట్టుకోలేదు. ఏడాది కాలంగా అన్ని పథకాలూ రద్దుచేయడం, ఒక్క పథకాన్నీ ఇవ్వకపోవడం, మరోవైపు కరెంటు ఛార్జీలు, స్కూలు ఫీజులు, వైద్యం ఖర్చలు, నిత్యావసరాలు పెరిగిపోవడంతో రాష్ట్రంలో కోట్లాది కుటుంబాల బడ్జెట్‌ చిత్రాలు మారిపోయాయి. అందుకే లోకేష్‌ తొలిసారిగా తాను భారీ ప్రకటన చేస్తున్నానని భావించినా, గత ప్రభుత్వం సృష్టించిన మార్క్‌ దరిదాపుల్లో లేకపోవడంతో ప్రజలు అంత ఆసక్తిని ప్రదర్శించలేదు. ఆఖరికి భవిష్యత్తు వారసుడిగా లోకేష్‌ను చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం చెందాయి. ఆయన్ని ఎత్తేందుకు వాడిన జాకీలమధ్యే ఆయన నలిగిపోయారు.

Join WhatsApp

Join Now

Leave a Comment