రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం.. హైకోర్టులో కీలక పరిణామం

రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం.. హైకోర్టులో కీలక పరిణామం

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా సృష్టించిన క‌ళ్యాణ‌దుర్గం (Kalyanadurgam) రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం (E-Stamp Scam) పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) అమిలినేని సురేంద్రబాబు (Amilineni Surendrababu) ప్రమేయం ఉందంటూ వైసీపీ(YSRCP) మాజీ ఎంపీ తలారి రంగయ్య (Talari Rangayya) దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసుకు సంబంధించిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో ఈ స్కాంపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. విచారణకు హాజరైన ఈడీ(ED) అధికారులు, ఈ కేసుపై త్వరలో కౌంటర్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

కళ్యాణదుర్గంలో వెలుగులోకి వచ్చిన ఈ-స్టాంప్ స్కాం విలువ రూ.920 కోట్లుగా గ‌తంలో అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఎర్రప్ప అలియాస్ ‘మీసేవ బాబు’ (Errappa alias ‘Meeseva Babu’)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు సన్నిహితుడిగా పనిచేసే మీసేవ బాబు ఇంట్లో జరిగిన సోదాల్లో పెద్ద ఎత్తున నకిలీ ఈ–స్టాంప్ పేపర్లు, రబ్బరు స్టాంపులు, కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కాయి. ఈ కేసులో బయటపడుతున్న వివరాలు అధికార పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర‌బాబు పాత్ర‌పై తీవ్ర చర్చకు దారితీశాయి.

పోలీసుల విచారణలో మీసేవ బాబు 13,000 నకిలీ ఈ–స్టాంప్ పత్రాలు ట్యాంపరింగ్ చేసి విక్రయించినట్లు బయటపడింది. ఈ నకిలీ పత్రాల ద్వారా ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ పేరిట స్టాంప్ డ్యూటీ ఎగవేసి, పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. యూనియన్ బ్యాంక్‌ను మోసం చేసి రూ.900 కోట్ల రుణం, టాటా క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్ల రుణం పొందిన‌ట్లుగా స‌మాచారం. మీసేవ బాబు, అతని భార్య ఖాతాలను పరిశీలించిన అధికారులు, దాదాపు రూ.2 కోట్ల నగదును గుర్తించారు. ఈ సంఘటన మొత్తం స్కాం పరిమాణాన్ని మరింత స్పష్టంగా తెలిపింది.

ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్రబాబు భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలు ఉండటం, మీసేవ బాబుతో కలిసి ఉన్న ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన విష‌యం తెలిసిందే. పిటిషన్‌లో కూడా ఇదే విషయాలను ప్రస్తావించడం హైకోర్టు విచారణను మరింత ప్రాధాన్యంగా మార్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ పై కోర్టు తీసుకునే నిర్ణయం అధికార పార్టీపై తీవ్ర‌ ప్రభావం చూపే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment