అనంతపురం (Anantapuram) జిల్లా గుత్తి (Gooty) పట్టణంలోని వీరారెడ్డి కాలనీ (Veerareddy Colony)లో టీడీపీ(TDP) ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. కాలనీలో నివాసం ఉంటున్న దస్తగిరి అనే వ్యక్తిపై ఎమ్మెల్యే గుమ్మనూరు (Gummanur) జయరాం (Jayaram) ఫాలోవర్స్ దాడికి తెగబడ్డారు. తాకట్టు పెట్టిన ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా దస్తగిరి ఇంట్లోకి చొరబడి అతని బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ దాడికి గుత్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్య ప్రతాప్ (Surya Pratap) నేతృత్వం వహించగా, స్థానిక పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దస్తగిరి (Dastagiri)ని ఆయన కుటుంబ సభ్యుల ఎదుటే టీడీపీ నాయకులు చితకబాదారు. దాడి వీడియోలు వైరల్ కావడంతో ఇది పెద్ద దుమారమే రేపుతోంది. బాధితుడు దస్తగిరి అనంతపురం ఎస్పీ జగదీష్ (SP Jagadeesh)ను కలిసి ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాలతో గుత్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్య ప్రతాప్‌తో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగకపోవడం గమనార్హం.
రాజకీయ ఆధిక్యతతో రెచ్చిపోయిన స్థానిక టీడీపీ నేతలపై మండిపడుతున్నారు ప్రజలు. ఇది మామూలు గొడవ కాదు.. అధికార బలాన్ని అడ్డుగా పెట్టుకుని సామాన్యులను వేధించే సంస్కృతి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితుడు దస్తగిరి వీడియో విడుదల చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని పలు ప్రజాసంఘాలు ప్రకటించాయి. ఘటనపై తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
🚨 Breaking
— Telugu Feed (@Telugufeedsite) August 5, 2025
గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయుల దాష్టీకం
తాకట్టు పెట్టిన ఇంటిని బలవంతంగా స్వాధీనం
ఇంటి యాజమాని దస్తగిరి పై విచక్షణారహితంగా దాడి..భార్యా, పిల్లల ఎదుటే దస్తగిరి పై దాడి చేసిన టీడీపీ నేతలు
గుత్తి పట్టణంలోని వీరారెడ్డి కాలనీలో… pic.twitter.com/u11qzNZicL