‘వాళ్లది త‌ప్పుడు ప్ర‌చారం’.. RBI డేటాతో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్‌

వాళ్లది త‌ప్పుడు ప్ర‌చారం.. RBI డేటాతో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్‌

2019 నుంచి 2024 మధ్యకాలంలో పారిశ్రామిక తయారీ రంగం (మ్యానిఫ్యాక్చరింగ్ సెక్టార్) (Manufacturing Sector) వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) దక్షిణ భారతదేశంలో (South India) నంబర్–1 స్థానంలో నిలిచిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) వెల్లడించారు. దీనికి సంబంధించి RBI అధికారిక గణాంకాలను (RBI Official Statistics) ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేస్తూ, టీడీపీ–జనసేన పార్టీలు(TDP-Jana Sena Parties) ఏపీపై చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల ముందు నుంచీ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప‌నిక‌ట్టుకుని వైసీపీ ప్రభుత్వం (YSRCP Government)పై విష ప్రచారం చేస్తున్నాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారని, తన హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు సందర్భం ఉన్నా లేకపోయినా విమర్శలు చేస్తూనే ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైనట్టుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ఈ విమర్శలకు వైఎస్ జగన్ గట్టిగా స్పందించారు. 2019–24 మధ్యకాలంలో వారు చెబుతున్నది నిజమైతే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం ఉండేదే కాదని ప్రశ్నించారు. కానీ, వాస్తవాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.

గణాంకాల ప్రకారం తయారీ రంగం (Manufacturing Sector) వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్–1గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ రంగంలో ఏపీకి ఐదో స్థానం లభించింది. అలాగే పరిశ్రమల రంగం (Industry Sector) మొత్తం వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఏపీ నంబర్–1గా, దేశవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో సాధించిన ఫలితాలేనని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

“ఇప్పుడు మీరే చెప్పండి… 2019–24 మధ్యలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? లేక ఇంతకుముందు ఎప్పుడూ చూడని స్థాయిలో పారిశ్రామిక పురోగతి సాధించామా?” అంటూ వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రశ్నించారు. ఈ గణాంకాలు బయటకు రావడంతో టీడీపీ, జనసేన పార్టీలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని తేలిపోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment