సూర్య కెరీర్‌లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ.. త్వరలో

సూర్య కెరీర్‌లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో మరో భారీ మైలురాయి సెట్ అవుతోంది. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సూర్య, ఇప్పుడు తన 50వ ప్రతిష్టాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. కోర్ట్‌రూమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘కరుప్పు’లో త్రిష తో కలిసి సూర్య చూపించిన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ మూవీ ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ థియేట్రికల్ హిట్‌గా దూసుకుపోతోంది. ఈ భారీ సక్సెస్ జోష్‌లోనే ఇప్పుడు “సూర్య 50”పై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ల్యాండ్‌మార్క్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ చివరి చిత్రం జననాయగన్ ను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్, అదే రేంజ్‌లో సూర్య 50ను పాన్-ఇండియా విజువల్ వండర్‌గా ప్లాన్ చేస్తోందట. భారీ బడ్జెట్‌తో పాటు టాలీవుడ్ లేదా కోలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ డైరెక్టర్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దించాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక ప్రముఖ దర్శకుడితో కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment