“కాక్రోచ్ జనతా పార్టీ”పై సుప్రీంకోర్టు షాక్..

“కాక్రోచ్ జనతా పార్టీ”పై సుప్రీంకోర్టు షాక్..

“కాక్రోచ్ జనతా పార్టీ”(Cockroach Janata Party) వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్(Surya Kant) సోమవారం తిరస్కరించారు. “దీనిని అంత సెంటిమెంట్‌గా తీసుకోకండి.. ఇందులో అత్యవసరం ఏమీ లేదు” అంటూ వ్యాఖ్యానించిన ఆయన, సరైన సమయంలో పిటిషన్లను విచారణకు తీసుకుంటామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో(Supreme Court of India) విచారణ సందర్భంగా అడ్వకేట్ ఎన్‌కే గోస్వామి(N.K. Goswami) … సీజేఐ (CJI) వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చినా సోషల్ మీడియాలో ఇంకా వక్రీకృత ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ అంశంపై అత్యవసర విచారణ అవసరం లేదని బెంచ్ తేల్చిచెప్పింది.

ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది మే 15న జరిగిన ఒక విచారణలో సీజేఐ చేసిన వ్యాఖ్యలు. “వ్యవస్థపై దాడులు చేసే కొందరు యువకులు ఉద్యోగాలు లేక కాక్రాచ్‌లలా మారుతున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వ్యంగ్య ఉద్యమం ప్రారంభమై నిరుద్యోగం(Unemployment), పరీక్షల పేపర్ లీకులు (Exam Paper Leaks), పాలన వైఫల్యాలపై మీమ్స్‌, పోస్టులు వెల్లువెత్తాయి. విమర్శలు పెరగడంతో సీజేఐ తర్వాత వివరణ ఇస్తూ.. “దేశ యువతను కాదు, నకిలీ డిగ్రీలతో న్యాయవృత్తిలోకి వచ్చిన వారినే ఉద్దేశించాను” అని పేర్కొన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వివాదం మరింత ముదిరి దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

ఇక ఈ ఉద్యమాన్ని మహారాష్ట్రకు (Maharashtra) చెందిన యువకుడు అభిజీత్ దిప్కే(Abhijeet Dipke) ప్రారంభించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అతడు ప్రారంభించిన సోషల్ మీడియా ఖాతాలు కొద్ది రోజుల్లోనే లక్షలాది ఫాలోవర్లను సంపాదించాయి. అనంతరం జాతీయ భద్రతా కారణాలతో కొన్ని ఖాతాలను భారత్‌లో(India) నిలిపివేసినట్లు సమాచారం. తన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్ హ్యాక్ అయ్యాయని అభిజీత్ ఆరోపించగా.. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లో ఉన్న అతని నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో ఈ అంశం మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment