పెళ్లికి ముందు శారీరక సంబంధం తప్పు కాదు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

పెళ్లికి ముందు శారీరక సంబంధం తప్పు కాదు - సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

మారుతున్న సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పరస్పర అంగీకారంతో ఇద్దరు మేజర్లు పెళ్లికి (Marriage) ముందు శారీరక సంబంధం (Physical Relationship) కలిగి ఉండటం నేరం (Crime) కాదని, కేవలం ఆ ఒక్క కారణంతో వారి నడవడికను, క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ప్రతి ప్రేమ బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని, కేవలం వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరిని మరొకరు మోసం చేసినట్టు భావించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే కానిస్టేబుల్ అభ్యర్థి (Constable Candidate) ఎంపిక రద్దు (Selection Cancellation) వివాహంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

అసలు కేసు నేపథ్యం ఏమిటి?
తెలంగాణకు (Telangana) చెందిన గాజుల తిరుపతి (Gajula Tirupathi) 2014లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో తాత్కాలికంగా ఎంపికయ్యాడు. అయితే, గతంలో ఒక మహిళతో ప్రేమ, పెళ్లి నిరాకరణ వ్యవహారంలో అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఆ వివాదం సర్దుమణిగి, లోక్ అదాలత్ (Lok Adalat) ద్వారా కేసు వీగిపోయింది. అయినప్పటికీ, తిరుపతి ప్రవర్తనపై తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అతడి ఎంపికను రద్దు చేసింది. దీనిపై తిరుపతి న్యాయపోరాటం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఉద్యోగ నియామక బోర్డు వాదనలను పూర్తిగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు, అభ్యర్థికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

  • పరస్పర అంగీకారంతో ఉన్న ఇద్దరు అవివాహిత వయోజనుల మధ్య శారీరక సంబంధం ఉండటం అనేది, కేవలం దాని ఆధారంగా ఒక వ్యక్తి నడవడికపై ప్రతికూల (నెగటివ్) అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి వీల్లేదని తెలిపింది.
  • ఇద్దరు మేజర్లు (Majors) తమ ఇష్టానుసారం సంబంధాన్ని కలిగి ఉండటాన్ని నిషేధించే చట్టం మన దేశంలో ఏదీ లేదు. మారుతున్న సమాజంలో ఇవి సహజం.
  • కేవలం ఒక సంబంధం వివాహంతో ముగియలేదన్న కారణంతో ఒక పక్షం మరొక పక్షాన్ని మోసం చేసిందన్న ప్రతికూల నిర్ధారణకు రాలేము. ప్రతి ప్రేమ బంధం పెళ్లి పీటల వరకు వెళ్లకపోవచ్చు.
  • బాధితురాలే స్వయంగా కేసును ముగించాలనుకున్నప్పుడు, నియామక సంస్థలు క్యారెక్టర్ సరిగ్గా లేదంటూ నెగటివ్ ముద్ర వేయకూడదు.

“వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉద్యోగ అర్హతలను శాసించలేవు. నైతికత (Morality) వేరు, చట్టం (Law) వేరు. నిందితుడు తప్పు చేశాడని కోర్టులలో నిరూపితం కానంత వరకు అతనిని దోషిగా చూడలేం” అని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Telangana Police Recruitment Board) తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా కొట్టివేసిన సుప్రీంకోర్టు.. గాజుల తిరుపతికి తక్షణమే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా క్యారెక్టర్ వెరిఫికేషన్ (Character Verification) నిబంధనలపై సరికొత్త చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment