ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో వచ్చిన సినిమా పుష్ప, పుష్ప 2 (Pushpa 2)ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు, ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక (Rashmika) కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.
కాగా పుష్ప – 2 ఎండ్ లో సెకండ్ పార్ట్ కు సీక్వెల్ గా పుష్ప 3 ఉందని సుకుమార్ అనౌన్స్ చేసాడు . కానీ ఈ సినిమా ఉండదు, ఎదో హైప్ కోసం పార్ట్ 3 అని వేశారని కామెంట్స్ వినిపించాయి. అటు అల్లు అర్జున్ కూడా అట్లీతో సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నెసాడు. అత్యంత భారీ బడ్జెట్ పై సన్ పిచ్చర్స్ (Sun Pictures) ఈ సినిమాను నిర్మిస్తోంది. కాని పుష్ప తర్వాత సుకుమార్ ప్రస్తుతం మరేఇతర సినిమా చేయడం లేదు. రామ్ చరణ్ కోసం ఓ కథను రెడీ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఇక అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఉండకపోవచ్చు అనే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలకు ఒక్క మాటలో ఫుల్ స్టాప్ పెటేసాడు సుకుమార్. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ కార్యక్రమంలో సుకుమార్ పుష్ప 3 కన్ఫామ్ గా ఉంటుందని చెప్పారు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేది చెప్పలేదు సుకుమార్. అయితే బన్నీ – సుకుమార్ కమిట్మెంట్స్ ఫినిష్ అయి పుష్ప 3 స్టార్ట్ అయేందుకు చాలా కాలం టైమ్ పట్టనుంది.







