శ్రీలీల నిశ్చితార్థం..? ‘బిగ్‌ డే’ అంటూ ఫోటోలు విడుదల..

శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్‌ డే' అంటూ ఫోటోలు విడుదల..

టాలీవుడ్‌ (Tollywood) లో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన శ్రీలీల (Sreeleela) గురించి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె త్వరలో పెళ్లి (Marriage) చేసుకోబోతున్నట్లు నెట్టింట ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీనికి కారణం శ్రీలీల (Sreeleela) ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో (Instagram Stories) షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలేనని సమాచారం. ఈ ఫోటోల్లో ఆమె చెంపలపై పసుపు రాసుకుని, కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపించింది. “ఈ రోజు నాకు ‘బిగ్‌ డే’ (Big Day)” అంటూ, వివరాలు “త్వరలో వెల్లడిస్తాను” అని హింట్‌ ఇవ్వడంతో నెటిజన్లు శ్రీలీల నిశ్చితార్థం (Sreeleela Engagement) జరిగిందని, త్వరలో పెళ్లి ఉంటుందని ఊహించారు.

అయితే, వాస్తవంగా ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. శ్రీలీల పుట్టినరోజు జూన్‌ 14న ఉన్నప్పటికీ, తిథుల ప్రకారం ఆమె ఈ వేడుకను ముందుగానే జరుపుకున్నట్లు సమాచారం. ప్రతి ఏటా ఆమె ఇలాంటి సంప్రదాయబద్ధమైన వేడుకలు జరుపుకోవడం అలవాటని తెలుస్తోంది. అయినప్పటికీ, హీరోయిన్‌గా ఉంటూ ఇలా తిథుల ప్రకారం పుట్టినరోజు సెలబ్రేట్‌ చేయడం చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీలీల షేర్‌ చేసిన ఫోటోలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె నిశ్చితార్థం జరిగిందని అనుకుంటుంటే, మరికొందరు ఇది ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం చేసిన ప్రమోషన్‌ కావచ్చని భావిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది ఆమె పుట్టినరోజు వేడుకలేనని అంటున్నారు. ఫోటోలు షేర్‌ చేసేటప్పుడు స్పష్టమైన సమాచారం ఇస్తే ఈ గందరగోళం ఉండేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలో శ్రీలీల ఈ విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan)తో శ్రీలీల డేటింగ్‌ (Dating)లో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అనురాగ్‌ బసు (Anurag Basu) దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారని టాక్‌ నడుస్తోంది. కార్తిక్‌ ఫ్యామిలీ వేడుకల్లో శ్రీలీల తరచూ కనిపిస్తుండటం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఇటీవల జరిగిన ‘ఐఫా’ (IIFA) వేడుకల్లో కార్తిక్‌ ఆర్యన్‌ తల్లి మాట్లాడుతూ, “మా ఇంటికి మంచి వైద్యురాలు కోడలిగా రావాలని కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు. శ్రీలీల నటి మాత్రమే కాదు, ప్రస్తుతం ఎంబీబీఎస్‌ చదువుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు శ్రీలీలతో కార్తిక్‌ సంబంధం గురించి మరింత ఊహాగానాలకు దారితీశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment