బాలీవుడ్ (Bollywood) నటుడు సోనూ సూద్ (Sonu Sood) కేవలం తన నటనతోనే కాకుండా, కోవిడ్ (COVID) సమయంలో చేసిన సామాజిక సేవ (Social Service)తో ప్రజలకు దేవుడయ్యాడు. నాటి నుంచి నేటి వరకు ఆయన సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఏటా కోట్లాది రూపాయలను సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్న సోనూ, కష్టాల్లో ఉన్నవారికి వెంటనే స్పందించి అండగా నిలుస్తారు. తాజాగా మరోసారి తన గొప్ప దానగుణాన్ని చాటుకున్నారు.
సోషల్ మీడియాలో ఇటీవల ఒక వృద్ధ జంట (Old Couple) పొలం దున్నుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ వృద్ధ దంపతులకు ఎద్దులు (Bulls) లేకపోవడంతో, పెద్దాయన స్వయంగా తనను తాను ఎద్దుగా చేసుకుని నాగలి కట్టి వ్యవసాయం చేయడం అందరినీ కలచివేసింది. వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియో సోనూ సూద్ దృష్టికి వెళ్లగానే, ఆయన వెంటనే స్పందించారు. ఆ వృద్ధ రైతును సంప్రదించి, వారికి వ్యవసాయం కోసం అవసరమైన పశువులను అందిస్తానని హామీ ఇచ్చారు. “మీరు నాకు నంబర్ పంపండి, నేను మీకు కావాల్సిన పాడి పశువులను పంపుతాను” అని ఆయన X (గతంలో ట్విట్టర్)లో ఆ వీడియోకు ప్రతిస్పందనగా రాశారు. సోనూ సూద్ చూపించిన ఈ మానవత్వానికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.








