బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నేత సోము వీర్రాజు పేరును అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వీర్రాజు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా నిలిచారు.

ఎన్డీయే కూటమి తరఫున ఇప్పటికే పలు పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ నుంచి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు అభ్యర్థులుగా నిలవగా, జనసేన నుంచి నాగబాబు పేరు ఫైనల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ మూడు టీడీపీ, జనసేన, బీజేపీ చేరొక్కటి చొప్పున పంచుకున్నాయి. టీడీపీ కొత్తవారికి అవకాశం ఇవ్వగా, ఆ నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. జనసేనా తరపున పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు నామినేషన్ వేయగా, బీజేపీ మాత్రం సీనియర్ లీడర్ సోము వీర్రాజుకు అవకాశం కల్పించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment