ఎస్ఎల్‌బిసి (SLBC) టన్నెల్ (Tunnel) లో చోటుచేసుకున్న విషాదం అందరికీ తెలిసిన సంగతే. టన్నెల్ లో పని చేస్తున్న సమయంలో ఎనిమిది మంది కార్మికులు ప్రమాదవశాత్తు లోపలే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి సహాయక చర్యలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కీలక దశకు చేరింది. 53 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ చర్యల్లో ఇప్పటికీ ఆరుగురు మృతదేహాల (Dead Bodies) ఆచూకీ లభించకపోవడం బాధాకరం. టన్నెల్ లో పేరుకుపోయిన భారీ మట్టి, టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) శకలాలను కన్వేయర్ బెల్ట్ (Conveyor Belt) సహాయంతో బయటకు తరలిస్తూ బృందాలు విపరీతంగా శ్రమిస్తున్నాయి.
చివరి 20 మీటర్లే కీలకం
ఇంతకీ మిగిలిన మృతదేహాలు టన్నెల్ లో చివరి 20 మీటర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని, నిపుణుల సూచనల మేరకు D1 ప్రదేశంలో మట్టిని తొలగించే పని మరింత వేగంగా, జాగ్రత్తగా కొనసాగుతోంది.
నిపుణుల నేతృత్వంలో చర్యలు
ఈ రెస్క్యూలో అనేక సాంకేతిక పరికరాలు, నిపుణుల మద్దతుతో బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయి. బాధిత కుటుంబాల మనోభావాలను గౌరవిస్తూ, చివరి వరకు మృతదేహాలను గుర్తించేందుకు జాగ్రత్తగా మట్టిని తవ్వుతున్నారు. “చివరి వరకు ఆశను వదలకుండా పోరాటం కొనసాగుతుంది” అని అధికారులు వెల్లడిస్తున్నారు.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య