ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల ని కలిసిన కేటీఆర్

ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల ని కలిసిన కేటీఆర్

సిరిసిల్ల (Sircilla) వస్త్ర పరిశ్రమపై (Textile Industry) పెరుగుతున్న విద్యుత్ బకాయిలు (Electricity Dues), సర్‌చార్జిల (Surcharges) భారం తెలంగాణ రాజకీయ వేదికపై ప్రధాన చర్చగా మారింది. ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswara Rao) ను పరిశ్రమలు కలిసిన కేటీఆర్(KTR). సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న బ్యాక్ బిల్లులు, సర్‌చార్జిలను భారం పై వాటిని మాఫీ చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేసారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమలు నిలకడగా నడిచినప్పటికీ, ఇప్పుడు ‘బ్యాక్ బిల్లింగ్’ (Back Billing) విధానం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడినట్లు తెలిపారు.

2016 నుండి 2024 వరకు సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం విధించారు, సర్‌చార్జిలతో కలిపి ఇది ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరింది. ఈ భారం వల్ల అనేక యూనిట్లు మూతపడడం, ఆర్థిక ఇబ్బందులు కారణంగా 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం గట్టిగా రాజకీయ మరియు సామాజిక చర్చను ఉత్పత్తి చేసింది. పరిశ్రమల విజ్ఞప్తి ప్రకారం, ప్రభుత్వం మానవీయ కోణంలో ఈ బకాయిలను రద్దు చేయాలని, తెలంగాణ నేతన్నలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment