తెలంగాణ (Telangana) నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ప్రమాణ స్వీకారం చేశారు.. తెలుగులో ప్రమాణం చేయడం ఆసక్తిగా మారింది. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Vikramarka), మంత్రులు హాజరయ్యారు. ముందుగా పూర్తి వందేమాతరం గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఇక శివ్ ప్రతాప్ శుక్లా విషయానికి వస్తే.. ఆయన 73 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన నేత. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన, ఏబీవీపీ (ABVP) ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు సైతం వెళ్లారు. యూపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2023-2026 మధ్య హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తెలంగాణ (Telangana Governor)కు విచ్చేశారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు