కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శుక్ర‌వారం త‌న అనుచ‌రుల‌తో తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యానికి శైల‌జానాథ్ చేరుకున్నారు. పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇటీవల వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పార్టీ వీడుతున్న పరిస్థితుల్లో, శైలజానాథ్ చేరికతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చినట్లు అయ్యింది.

అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. 2022లో ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా అధిష్టానం వైఎస్ ష‌ర్మిల‌ను నియ‌మించ‌డంతో శైల‌జానాథ్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఎక్కడా పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో క‌ర్నూలులో జ‌రిగిన ఓ వేడుక‌లో జ‌గ‌న్‌ను శైల‌జానాథ్ క‌లిశారు. అప్పుడే వైసీపీలో చేర‌బోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చినా.. శైల‌జానాథ్ కాస్త గ్యాప్ తీసుకొని ఇవాళ వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment