షాకింగ్‌.. సంగం పెరుగు ప్యాకెట్‌లో ఎలుక పిల్ల (Video)

షాకింగ్‌.. సంగం పెరుగు ప్యాకెట్‌లో ఎలుక పిల్ల (Video)

Summarize with AI

మనం నిత్యం నమ్మకంగా కొనే ఆహార పదార్థాలు (Food Products) ఎంతవరకు సురక్షితం? ప్రముఖ బ్రాండ్లు (Leading Brands) అందిస్తున్న నాణ్యత (Quality) ఇదేనా? అనే ప్రశ్నలు రేకెత్తించేలా వరంగల్‌లో (Warangal) ఒక ఘోర ఉదంతం వెలుగుచూసింది. ల్యాబ్‌లలో పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని చెప్పుకునే డెయిరీ సంస్థల (Dairy Companies) నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.

వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోట (SRR Thota) సమీపంలోని ఒక కిరాణా షాపులో (Grocery Store) ఆదివారం ఒక వినియోగదారుడు పెరుగు ప్యాకెట్‌ (Curd Packet) కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి, ప్యాకెట్‌ను కట్‌ చేయగా.. అందులో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. ఇది చూసి సదరు బాధితుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే కిరాణా షాపు యజమానిని నిలదీయడమే కాకుండా, ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందిన వెంటనే వరంగల్ జిల్లా ఫుడ్ ఆఫీసర్ (Food Officer) మౌనిక (Mounika) ఆధ్వర్యంలో అధికారులు కరీమాబాద్‌తో (Karimabad) పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎలుక పిల్ల (Baby Rat) వచ్చిన నిర్దిష్ట ‘బ్యాచ్‌’కు (Specific Batch) చెందిన పెరుగు ప్యాకెట్ల అమ్మకాలను తక్షణమే నిలిపివేయించారు. జనగామలో 50 ప్యాకెట్లతో పాటు కరీమాబాద్‌, లక్ష్మీపురం మార్కెట్‌ ఏరియా, హనుమకొండ భవానీనగర్‌లోని పలు షాపుల్లో ఆ బ్యాచ్‌కు చెందిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుపుతున్నామని, సదరు పెరుగు శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపుతున్నట్లు జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి తెలిపారు.

పాలు(Milk), పెరుగు(Curd) లాంటి అత్యవసర డైరీ ప్రొడక్ట్స్‌ను చిన్న పిల్లల (Children) నుండి వృద్ధుల (Elderly) వరకు అందరూ నమ్మి వాడుతుంటారు. ఆటోమేటెడ్ ప్లాంట్లు, అధునాతన ప్యాకింగ్ మిషన్లు ఉన్నాయని ప్రచారం చేసుకునే డెయిరీ సంస్థల ప్లాంట్లలోకి అసలు ఎలుకలు ఎలా ప్రవేశిస్తున్నాయి? ప్యాకింగ్ లైన్‌లోకి ఎలుక పిల్ల వచ్చి ప్యాకెట్ సీల్ అయ్యేంతవరకు అక్కడ కనీస పర్యవేక్షణ లేదా? ఒకవేళ ఆ పెరుగును తిని ఉంటే, ఆ కుటుంబం పరిస్థితి ఏంటనేది ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సదరు డెయిరీ ఉత్పత్తి కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేసి, అక్కడ ప్యాకింగ్ ఏ పరిస్థితుల్లో జరుగుతుందో బహిర్గతం చేయాలి. కేవలం నోటీసులతో సరిపెట్టకుండా, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు సదరు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లాభాల వేటలో పడి వినియోగదారుల ఆరోగ్య భద్రతను గాలికి వదిలేసే ఏ సంస్థనైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందే. అప్పుడే ప్రజలకు తాము తినే ఆహారంపై నమ్మకం ఉంటుందంటున్నారు వినియోగ‌దారులు.

Join WhatsApp

Join Now

Leave a Comment