బాలీవుడ్ (Bollywood) కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) మరియు టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) కలిసి నటిస్తున్న చిత్రం ‘సికందర్ (Sikandar)’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వీరిద్దరి మధ్య 31 ఏళ్ల వయస్సు తేడా ఉందన్న అంశంపై అభిమానులు, సినీ ప్రేమికులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా, తాజాగా నటి అమీషా పటేల్ స్పందించారు.
సమస్యే కాదు – అమీషా
ఈ విషయంపై అమీషా పటేల్ (Amisha Patel) తనదైన శైలిలో స్పందించారు. “సినిమా ఒక కళ. నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ (Age Gap) అసలు పెద్ద విషయం కాదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటి కాంబినేషన్లు కొత్తేమీ కావు” అని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా సీనియర్ హీరోలు, యంగ్ హీరోయిన్లు కలిసి నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అమీషా అభిప్రాయపడ్డారు. సికందర్ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఈ వయస్సు తేడా అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.