బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్‌ను అలరించడానికి చిత్ర యూనిట్ సికందర్ మూవీ టీజర్(Sikandar Teaser)ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అగ్ర దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా(Sajid Nadiadwala) నిర్మిస్తున్నారు.
హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్
తాజాగా చిత్రబృందం విడుదల చేసిన టీజర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మాస్ అండ్ యాక్షన్ మిక్స్‌తో అదిరిపోయే విజువల్స్ టీజర్‌లో కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ స్టైల్, రష్మిక గ్లామర్, మురుగదాస్ మేకింగ్ – ఈ మూవీపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.