బీఆర్ఎస్ రజతోత్సవ స‌భ‌లో బ‌న్నీ సందడి

బీఆర్ఎస్ రజతోత్సవ స‌భ‌లో బ‌న్నీ సందడి

Summarize with AI

భార‌త్ రాష్ట్ర స‌మితి (BRS) రజతోత్సవ సభ (Silver Jubilee Celebration Meeting) వ‌రంగ‌ల్‌లోని (Warangal) ఎల్క‌తుర్తి (Elkathurthy) లో ఘ‌నంగా జ‌రిగింది. స‌భ‌కు తెలంగాణ రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ల‌క్ష‌ల్లో హాజ‌రై 25 ఏళ్ల గులాబీ జెండా పండుగ‌ను విజ‌య‌వంతం చేశారు. కాగా, బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో పార్టీ ప్రెసిడెంట్, మాజీ సీఎం కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు (K. Chandrashekar Rao – KCR) ప్ర‌సంగం హైలైట్‌గా నిలిచింది.

కాగా, బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగ‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స‌భ‌కు అల్లు అర్జున్ వ‌చ్చారా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అస‌లు సంగ‌తేంటంటే.. బీఆర్ఎస్ స‌భ‌లో అల్లు అర్జున్ ఫ్లెక్సీలు (Flex Banners) దర్శనమిచ్చాయి. ఫ్యాన్స్ కేటీఆర్ (KTR) ఫొటోతో పాటు బ‌న్నీ(Bunny ఫొటోలు ఫ్లెక్సీలు రూపొందించి స‌భ‌లో హ‌ల్‌చ‌ల్ చేశారు. బ‌న్నీ ఫ్లెక్సీలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. సభ ప్రాంగణంలో ఒక వైపు సీఎం కేసీఆర్, మరో వైపు బన్నీ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఫ్లెక్సీలపై “కేసీఆర్ అంటే పేరు కాదు.. కేసీఆర్ అంటే బ్రాండ్.. తగ్గేదేలే” అనే నినాదాన్ని ప్రదర్శించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ దృశ్యాలను తెగ వైరల్ చేస్తున్నారు. బన్నీ అభిమానులు మాత్రం తమ హీరోకి రాజకీయ వేదికలపైనా అలాంటి గుర్తింపు రావడం గర్వంగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment