సాయి పల్లవి తాజాగా “అమరన్” చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆమె కొత్త ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకొస్తున్నాయి. బలగం సినిమాతో ప్రసిద్ది చెందిన దర్శకుడు వేణు ఎల్దండి, ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కొత్త కథను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో హీరోగా నితిన్ నటించనున్నారు. అయితే, ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి నటించనున్నారని సమాచారం. ఫిదా, లవ్ స్టోరీ చిత్రాల్లో తెలంగాణ అమ్మాయిగా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.
కాగా, వేణు త్వరలో తెరకెక్కించే ఎల్లమ్మ సినిమాలో సాయి పల్లవి పవర్ ఫుల్ పల్లెటూరి అమ్మాయిగా మెప్పించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం స్కిప్టు వర్క్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా మారిన సాయి పల్లవి, “ఫిదా”తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్‌ను మరింతగా నిలబెట్టుకుంటున్నారు.