ఒకే వేదికపైకి ముగ్గురు స్టార్ హీరోలు

ఒకే వేదికపైకి ముగ్గురు స్టార్ హీరోలు

Summarize with AI

ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్ బర్ట్ హాల్‌లో జరగనున్న ‘RRR’ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా క‌నిపిస్తున్నాయి.

ఇప్పటికే చెర్రీ తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్‌ చేరగా, తారక్, మహేష్ కూడా తమ షూటింగ్లకు తాత్కాలిక విరామం ఇచ్చి త్వరలో లండన్‌ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఒకే వేదికపై ఈ ముగ్గురు స్టార్ హీరోలు దర్శనమివ్వబోతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం ఊపందుకుంది. ఇండియన్ సినిమా గ్లోబల్ స్టేజిపై ఎలా మెరిసిపోతుందో చూపించే ఈ ఈవెంట్, మరిన్ని అద్భుత క్షణాలకు వేదిక కావడం ఖాయం.

Join WhatsApp

Join Now

Leave a Comment