మాజీ సీఎం రోశ‌య్య‌కు అరుదైన గౌర‌వం

మాజీ సీఎం రోశ‌య్య‌కు అరుదైన గౌర‌వం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) అరుదైన గౌరవం అందించనుంది. ఆయన జయంతి అయిన జూలై 4వ తేదీని ప్రతి సంవత్సరం అధికారికంగా ‘రోశయ్య జయంతి’ని నిర్వహించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా జరిగే జయంతి వేడుకల నిర్వహణ బాధ్యతను పర్యాటక, సాంస్కృతిక శాఖకు అప్పగించారు. అంతేకాదు, అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

రోశయ్య రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాళ్లను సాధించారు. కాంగ్రెస్ హయాంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. ఈ విశేషాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయన సేవలను స్మరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న జన్మించి, 2021 డిసెంబర్ 4న కన్నుమూశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment