రేవంత్ సర్కార్ భూముల వేలానికి సిద్ధం..ఎకరాకు రూ.101 కోట్లు

సర్కార్ భూముల వేలానికి సిద్ధం: ఎకరాకు రూ.101 కోట్ల కనీస ధర

Summarize with AI

తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

ఎకరాకు రూ.101 కోట్లు కనీస ధరగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ప్రకటించింది. ఈ ధరకే భూమి అమ్ముడైతే, ప్రభుత్వానికి సుమారు రూ.1900 కోట్లు ఆదాయం వస్తుంది. ఒకవేళ వేలంలో పోటీ పెరిగితే, ఆదాయం మరింత ఎక్కువగా ఉండవచ్చు.

గత నెలలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)కి చెందిన 7.8 ఎకరాలను ప్రభుత్వం ఈ-వేలం ద్వారా విక్రయించింది. ఆ వేలంలో ఎకరం రూ.70 కోట్లు పలికింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ భూమిని కొనుగోలు చేయగా, ప్రభుత్వానికి రూ.547 కోట్లు ఆదాయం వచ్చింది. ఆ వేలం కోసం గోద్రెజ్‌తో పాటు అరబిందో రియల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి ప్రముఖ సంస్థలు పోటీపడ్డాయి. అప్పుడు ఎకరాకు కనీస ధరను రూ.40 కోట్లుగా నిర్ణయించారు. అంతకుముందు కూడా భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment